సీఏకు రాజీనామా చేసిన వార్నర్..

SMTV Desk 2018-03-31 11:02:39  david warner, ball tampering, australia team cricket former vice captain, smith

సిడ్నీ, మార్చి 31: తప్పు చేయడం మానవ నైజం.. కానీ చేసిన తప్పును అంగీకరించే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. వారు తప్పు చేశారు అన్నదానికన్నా.. ఎందుకు చేశామన్నా పశ్చాత్తాపం చాలు. వారిలో మార్పునకు అదే నిదర్శనం. దక్షిణాఫ్రికా తో మ్యాచ్ లో బాల్ టాంపరింగ్ ఘటనకు కారణమైన ముగ్గురి ఆస్ట్రేలియా ఆటగాళ్ల పై (స్మిత్, వార్నర్ , బాన్ క్రాఫ్ట్) క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాల్ టాంపరింగ్ వివాదంతో తీవ్రస్థాయిలో విమర్శలు పొందతున్న ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ మీడియా ముందు కన్నీటిపర్యంతమయ్యాడు. శనివారం మీడియా ముందుకు వచ్చిన వార్నర్‌ తన తప్పునకు శిక్షగా జీవితంలో ఆస్ట్రేలియా తరఫున క్రికెట్‌ ఆడబోవడం లేదని తెలిపాడు. ఈ మేరకు క్రికెట్‌ ఆస్ట్రేలియాకు రాజీనామా చేసినట్లు ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ చెప్పారు వార్నర్‌. కుటుంబంతో చర్చించిన అనంతరం క్రికెట్‌ నుంచి శాశ్వతంగా తప్పుకోవాలనే అంశంపై కూడా నిర్ణయం తీసుకుంటానని వార్నర్ వెల్లడించారు.