‘నీరవ్‌ మోదీని భారత్‌కు రప్పిస్తాం’: నిర్మలా సీతారామన్‌

SMTV Desk 2018-03-31 10:42:06   PNB Scam,nirmala sitaraman,Nirav Modi,Mehul Choksi

న్యూఢిల్లీ, మార్చి 31: అవినీతి రహిత పాలన అందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందదని, పీఎన్‌బీ భారీ కుంభకోణం నిందితులు నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీలను ఎలాగైనా భారత్‌కు రప్పిస్తామని కేంద్ర రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉద్ఘాటించారు. గురువారం ఎకనామిక్‌ టైమ్స్‌ నాలుగో వార్షికోత్సవ సదస్సులో పాల్గొన్న ఆమె ప్రసంగించారు. నీరవ్‌ మోదీలు, మెహుల్‌ చోక్సీలు ఆర్థిక నేరానికి పాల్పడ్డారు. వారు ఎంతో దూరం పారిపోలేరు. వారిని ఎలాగైనా వెనక్కి రప్పించి తీరతాం’ అని ఆమె స్పష్టం చేశారు. ఇక బీజేపీ ప్రభుత్వం పథకాలతో మెరుగైన సంస్కరణలకు పెద్ద పీట వేస్తోందని.. అందుకే జీఎస్టీనే మంచి ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు.