ఐపీఎల్‌ నుండి మిచెల్‌ స్టార్క్‌ ఔట్..

SMTV Desk 2018-03-30 18:58:30  mitchell starc, kolkatha knight riders, ipl-11, australia

న్యూఢిల్లీ, మార్చి 30 : ఐపీఎల్‌-11 సీజన్ ఆరంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్‌ స్టార్క్‌ కుడికాలి గాయంతో శుక్రవారం జోహాన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌ నుండి వైదొలిగాడు. ఈ క్రమంలో స్టార్క్‌ ఏప్రిల్‌ 7నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌కు కూడా దూరమైనట్లేనని క్రికెట్‌ ఆస్ట్రేలియా ట్విటర్‌ ద్వారా తెలిపింది. ఈ ఐపీఎల్‌ సీజనులో మిచెల్‌ స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు రూ.9.4కోట్లు పెట్టి కోనుగోలు చేసింది. కానీ స్టార్క్‌ గాయం విషయమై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫ్రాంఛైజీ నుంచి ఎలాంటి సమాచారం ఇంకా వెలువడలేదు. ఇంతకముందు బెంగళూరు ఛాలెంజర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన స్టార్క్‌ ఇప్పటివరకూ ఐపీఎల్‌లో 27మ్యాచ్‌లాడి 34వికెట్లు తీశాడు.