సమంత రామలక్ష్మిగా ఎలా మారిందంటే..!

SMTV Desk 2018-03-30 13:27:32  RANGASTHALAM MOVIE, SAMANTHA MAKEUP, CAMERAMEN RATHNAVELU.

హైదరాబాద్, మార్చి 30 : "రంగస్థలం" చిత్రంలో రామలక్ష్మి(సమంత) పాత్రలో సమంత ఎంత చక్కగా ఒదిగిపోయిందో కదా..! ఆమెకు ఆ లుక్ తీసుకురావడానికి మాత్రం చిత్రబృందం చాలా కసరత్తే చేశారట. సాధారణంగా స్టార్ హీరోయిన్లు పల్లెటూరి అమ్మాయిల పాత్రలకు సెట్టవ్వరు. అయినా కథానాయికలను పల్లెటూరి పాత్రల్లో చూపించడమంటే మాటలు కాదు. కాని దర్శకుడు సుకుమార్ మాత్రం ఒక అడుగు ముందుకేసి పల్లెటూరి నేపథ్యంలో సినిమా చేయడానికి సిద్దమయ్యాడు. "రంగస్థలం" సినిమాలో కథానాయిక సమంతను పక్కా పల్లెటూరి అమ్మాయిలాగా చూపించాడు. అయితే మంచి రంగులో ఉండే సమంతను ఎండల్లో కష్టపడే పక్కా పల్లెటూరి అమ్మాయిలా సహజంగా చూపించడం కోసం ఒక వెరైటీ మేకప్ ట్రై చేయించాడట కెమెరామన్ రత్నవేలు. మామూలుగా హీరోయిన్లకు వేసే మేకప్ మెటీరియల్లోకి బ్రౌన్ కలర్ మిక్స్ చేయించాడట. దీంతో ఆ మేకప్ వేయడం వల్ల ట్యాన్ లుక్ వచ్చి సహజసిద్దంగా కనిపించింది. మొదట సందేహంగానే మేకప్ వేసుకున్న సమంత మానిటర్ లో చూసుకొని మురిసిపోయిందట. అలా సమంత అలియాస్ రామలక్ష్మి అందాన్ని తగ్గించారు.