"మణికర్ణిక" @200 కోట్లు..!

SMTV Desk 2018-03-30 12:58:27  manikarnika, kangana ranaut, manikarnika budget 200 crores.

హైదరాబాద్, మార్చి 30 : వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా దర్శకుడు క్రిష్ "మణికర్ణిక" అనే చిత్రాన్ని హిందీలో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో ఝాన్సీగా కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఆమె లుక్ కు భారీస్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఈ సినిమా చారిత్రాత్మక నేపథ్యంలో సాగుతుంది కావున ఖర్చు కూడా 60 నుంచి 70 కోట్ల వరకూ ఉండొచ్చని అంతా భావించారు. కాని ఓ ఇంటర్వ్యూలో కంగనా బడ్జెట్ గురించి ప్రస్తావిస్తూ.. "ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు" అంటూ అందరికి షాక్ ఇచ్చింది. "మణికర్ణిక" చిత్రానికి ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్టు కంగనా చెప్పడం ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.