కేంద్ర మంత్రిని అడ్డుకున్న పోలీసులు

SMTV Desk 2018-03-30 10:51:52  Babul Supriyo, FIR assault, West Bengal

కోల్‌కతా, మార్చి 30 : కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియోను పోలీసులు గురువారం అడ్డుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో శ్రీరామనవమి సందర్భంగా ఉద్రిక్తతలు చెలరేగిన అసన్‌సోల్‌–రాణిగంజ్‌ ప్రాంతాన్ని సందర్శించడానికి యత్నించిన కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియోనుపై పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలుచేశారు. 144 సెక్షన్ విధించిన ప్రాంతంలోకి ప్రవేశించడానికి యత్నించడం, పోలీసుల విధులకు ఆటంకం కల్గించడంతో పాటు ఐపీఎస్‌ అధికారిపై ఆయన దాడి చేసినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.