రకుల్.. అబద్దం చెబుతున్నారు : మాధవీ లత

SMTV Desk 2018-03-29 17:32:22  RAKUL PREETH SINGH, CASTING COUCH, HEROINE MADHAVEE LATHA.

హైదరాబాద్, మార్చి 29 : సినీ పరిశ్రమలో గత కొంత కాలంగా కాస్టింగ్ కౌచ్ అనే పదం బాగా వినబడుతూ వస్తుంది. ఈ అంశంపై పలువురు భామలు తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వ‌ర‌కు లైంగిక వేధింపుల‌కు వ్య‌తిరేకంగా హీరోయిన్లంద‌రూ పోరాడుతూ త‌మ నిర‌స‌న‌ల‌ను తెలియ‌జేస్తున్నారు. తాజాగా హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్.. కాస్టింగ్ కౌచ్ పై విభిన్నంగా ప్రస్తావించింది. "మా" తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రకుల్.. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో "కాస్టింగ్ కౌచ్" అనేదే లేద‌ని, తనకు అలాంటి పరిస్థితి వేధింపులు ఎదుర్కోలేదని స్పష్టం చేసింది. అయితే రకుల్ చెప్పింది అంతా అబద్దం అంటూ తెలుగు హీరోయిన్ మాధ‌వీ ల‌త స్పందించడం వైరల్ గా మారింది. ఈ సందర్భంగా మాధవీ లత మాట్లాడుతూ.. రకుల్ చెప్పింది అబద్దం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. దీనిపై చాలా మంది స్పందించారు. కాని తెలుగులో మాత్రం ఎవరు సపోర్ట్ చేయటానికి ముందుకు రారు. ఇక్కడే కాదు ప్రతి చోట కాస్టింగ్ కౌచ్ ఉంది అంటూ వెల్లడించింది.