పవన్ ఫ్యాన్.. పోలాండ్ పిల్లాడు ఇప్పుడు హీరో..!

SMTV Desk 2018-03-29 17:07:36  jibigs bujji poland kid, pawan kalyan fan, papam pasivadu movie.

ముంబై, మార్చి 29 : ఎంతమంది హీరోలున్నా పవన్ కళ్యాణ్ కు ఉండే ఫాన్స్ ఫాలోయింగ్ వేరు. ఒక సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఆయనకు ఉండే అభిమానులు ఆయనకు ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. పవన్ కు విదేశాలలో సైతం అభిమానులు కోకొల్లలు. అయితే ఇటీవల పోలాండ్ పిల్లాడు కొడకా కోటేశ్వర్ రావు పాట పాడి పవర్ స్టార్ ఫ్యాన్స్ ని ఆకర్షించిన సంగతి తెలిసిందే. తెలుగు రాకపోయినా తడబడకుండా "కొడకా కోటేశ్వరరావ్" అనే పాటను పాడి తన అభిమానాన్ని చాటుకున్నాడు జిబిగ్స్ బుజ్జి. అతి తక్కువ కాలంలోనే పవన్ బ్రాండ్ తో స్టార్ట్ అయిపోయాడు. తాజాగా ఆ స్టార్ హోదా ఇప్పుడు అతన్ని హీరోను చేస్తోంది. జిబిగ్స్ బుజ్జి ప్రధాన పాత్రలో ఓ తెలుగు సినిమాను తెరకెక్కించడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి సరికొత్తగా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. డార్క్ థీమ్ తో రూపొందించిన ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాపై చిత్రబృంద౦ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.