భళా యామీ.. పోల్ డ్యాన్స్..

SMTV Desk 2018-03-29 16:39:13  Yami Gautam, yami Pole dancing, Jacquelines footsteps,

హైదరాబాద్, మార్చి 29 : ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో పేరు తెచ్చుకొని నేరుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి౦ది హీరోయిన్ యామీ గౌతమ్. కేవలం తెలుగులోనే కాకుండా ఈ భామ తమిళ, పంజాబీ, మలయాళం, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా హృతిక్ రోషన్ సరసన అంధురాలిగా "కాబిల్" చిత్రంలో ఒక వైవిధ్యమైన పాత్రను పోషించింది. ఇంత చేసినా ఈ అమ్మడుకి అదృష్టం మాత్రం కలిసి రాలేదనే చెప్పాలి. ఎప్పుడు నాజుకుగా కనిపించే యామి.. అప్పుడప్పుడు తన వ్యాయామ వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ చిన్నది పోల్ డ్యాన్స్ నేర్చుకునేందుకు అరిఫా బిందర్వాలా అనే సెలబ్రిటీ పోల్ డ్యాన్సింగ్ టీచర్ దగ్గర క్లాసులు తీసుకుంటోంది. ఈ సందర్భంగా పోల్ పట్టుకుని ఊగుతూ ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేసింది. "పోల్ డ్యాన్సింగ్ మనం అనుకున్నంత తేలికేం కాదు. శారీరకంగా ఫిట్ గా ఉండాలి. అదే టైమ్ లో డ్యాన్స్ కూడా బాగా తెలిసి ఉండాలి. రెండింటినీ కలిపి చేసే నృత్య౦ ఇది. అందుకే నాకు పోల్ డ్యాన్సింగ్ పైన మోజు కలిగింది" అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిస్ ఫెర్నాండేజ్ కి కూడా పోల్ డ్యాన్సులు నేర్పింది అరిఫా బిందర్వాలా కావడం విశేషం.