మెగా ప్రేమ పక్షులను చూడండి..

SMTV Desk 2018-03-29 15:55:25  KONIDELA SREEJA, SREEJA HUSBEND KALYAN, SECOND MARRIAGE ANNIVERSARY.

హైదరాబాద్, మార్చి 29 : మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ.. తన బాయ్ ఫ్రెండ్ కళ్యాణ్ ను రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి చేసుకొని రెండు సంవత్సరాలు పూర్తికావస్తున్నా వారి మధ్య ప్రేమ మాత్రం కొంచెం కూడా తగ్గలేదని వారిని చూస్తేనే అర్థమవుతుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే వీరిద్దరూ వారి జీవితంలో జరిగిన విషయాలను తమ అభిమానులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటారు. తాజాగా వారి రెండవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా శ్రీజ తన ఇన్ స్టాగ్రామ్ లో తన భర్తతో దిగిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. అంతేకాకుండా తన జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయం తన భర్తే అని కితాబిచ్చింది. అందుకు కళ్యాణ్.. "నువ్వే నా బలం. హ్యాపీ యానివెర్సరీ" అంటూ తన భార్యకు శుభాకాంక్షలు చెప్పాడు ఈ మెగా అల్లుడు. ప్రస్తుతం కళ్యాణ్ రాకేష్ శశి దర్శకత్వంలో ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.