ఆ సత్తా పవన్ లో ఉంది : నితిన్

SMTV Desk 2018-03-29 12:53:54  Hero nithin, chal mohan ranga, pawan kalyan, trivikram,

హైదరాబాద్, మార్చి 29 : య౦గ్ హీరో నితిన్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలు(రంగస్థలం, ఛల్ మోహన రంగ) కేవలం ఒక వారం తేడాతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో నితిన్ ప్రమోషన్స్ లో బిజీ అయిపోయారు. తండ్రి తర్వాత తానూ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఇద్దరు వ్యక్తులను మాత్రమే అంతగా అభిమానిస్తానని ఇదివరకు నితిన్ చాలా సందర్భాలలో వెల్లడించారు. ఇప్పుడు ఆ ముగ్గురి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం "ఛల్ మోహన రంగ"ను ఎప్పటికి మరచిపోలేనని అంటున్నాడు. ఈ సందర్భంగా పవన్ గురించి మాట్లాడుతూ.. "పవన్ ఐడియాలజీ గురించి తెలుసు కాని పాలిటిక్స్ నాకు అంతగా తెలియవు. ఏది ఏమైనా పాలిటిక్స్ లో మార్పు తీసుకురాగల సత్తా నా దేవుడు పవన్ దగ్గర ఉన్నాయి" అంటూ చెప్తున్నాడు ఈ హీరో.