జున్నుగాడు ఎంత క్యూట్ గా ఉన్నాడో..!

SMTV Desk 2018-03-29 12:33:31  nani son birthday, hero nani son arjun, nani twitter post.

హైదరాబాద్, మార్చి 29 : వరుస విజయాలతో అటు నటుడిగానే కాకుండా ఇటు నిర్మాతగా మంచి మార్కులే కొట్టేశారు హీరో నాని. అయితే నేచురల్ స్టార్ ఇంట్లోకి గతేడాది ఒక బుల్లి వారసుడు వచ్చిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో తన కొడుకుకు సంబంధించి హ్యాపీ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటాడు. ఈరోజు నాని కుమారుడు అర్జున్ మొదటి పుట్టిన రోజు కావడంతో.. చాలా డిఫెరెంట్ గా శుభాకాంక్షలు తెలిపారు. కారులో కూర్చొని తన కొడుకును ప్రేమతో హత్తుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. "నా చిట్టి రాస్కెల్‌ తొలి పుట్టినరోజు ఈరోజు. దొంగా నా కొడుకు. జున్ను గాడు" అంటూ.. పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం నాని మెకపార్ల గాంధీ దర్శకత్వంలో "కృష్ణార్జున యుద్ధం" అనే చిత్రంలో నటిస్తున్నారు. నాని ద్విపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమా వచ్చేనెల ప్రేక్షకుల ముందుకు రానుంది.