పాపం సాయి పల్లవి.. ??

SMTV Desk 2018-03-28 19:15:58  Saipallavi, Samantha, Shanthanu Bhagyaraj, Nithyaminon,

చెన్నై, మార్చి 28 : ప్రస్తుత కాలంలో ఉన్న హీరోయిన్స్ నటన కంటే గ్లామర్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ.. సాయి పల్లవి మాత్రం తన నటననే ఎక్కువగా నమ్ముకుంటుంది. తన నటనకు డాన్స్ ను కూడా జోడించి ప్రేక్షకుల్ని కట్టిపడేస్తూ.. విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. సాయిపల్లవి క్రేజ్ తో పాటు.. బాగా పొగరుబోతు అనే బిరుదును కూడా తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. ఇటీవలే ఆమె “కణం” సినిమాలో నాగశౌర్య సరసన నటించింది. అయితే ఆ సినిమా చిత్రీకరణ సమయంలో సాయి పల్లవి సినిమా టీమ్ అందరిని బాగా ఇబ్బంది పెట్టిందని నాగశౌర్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాజాగా సాయిపల్లవిని ఓ తమిళ సినిమా నుంచి తప్పించారని.. ఆమె ప్లేస్ లో సమంతను తీసుకున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. నిత్యా మీనన్.. సాయి పల్లవి హీరోయిన్లుగా కే.భాగ్యరాజ్ కుమారుడు శంతను భాగ్యరాజా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నుండి పల్లవిని తప్పించి.. ఆ పాత్రకు సమంతను ఎంపిక చేశారని సమాచారం. కాగా.. ఇందుకు కారణం ఆమె ప్రవర్తనేనని కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇన్ని విభేదాలు పెట్టుకుంటున్న సాయి పల్లవి సినీ పరిశ్రమలో ఎలా నిలదొక్కుకుంటుందో చూడాలి మరి..!