జిల్.. జిగేలు రాణి మా బామ్మ : పూజాహెగ్డే

SMTV Desk 2018-03-28 18:51:59  jil jil jigelu song, rangasthalam, pooja hegde, pooja grand mother dance.

హైదరాబాద్, మార్చి 28 : జిల్..జిల్..జిల్..జిల్..జిగేలు రాణి అంటూ పూజాహెగ్డే రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎవరి నోట చూసిన ఇదే పాట. రామ్ చరణ్, సమంత జంటగా నటించిన "రంగస్థలం" చిత్రంలోని ఈ పాట ప్రోమోను చెర్రి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. అయితే ఈ పాటకు మా బామ్మ ఆసుపత్రిలో చిందులేస్తున్నారని.. జిగేలు రాణి(పూజాహెగ్డే) ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ సందర్భంగా తన బామ్మ డాన్స్ చేసిన వీడియోను పూజా తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. "మా బామ్మ కొద్ది రోజుల నుండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నేను నటించిన "జిగేలు రాణి" పాటను చూసి ఆమె ఎంతో సంతోషించారు. అంతే కాదు ఒక కొత్త ఉత్సాహాన్ని, శక్తిని నింపుకొని డాన్స్ చేస్తూ పాట పాడుతుంది. అసలు పాట ఆపడం లేదు. అంతగా మా బామ్మకు ఈ పాట నచ్చింది" అంటూ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కు ట్యాగ్ చేసింది.