వేటు పడింది..

SMTV Desk 2018-03-28 14:18:26  david warner, steve smith, ball tampering, cricket australia

సీడ్నీ, మార్చి 28 : బాల్ టాంపరింగ్ వివాదంలో క్రికెట్ ఆస్ట్రేలియా ముగ్గురి ఆటగాళ్లపై వేటు వేసింది. ఈ ఘటనకు భాద్యులైన ముగ్గురిపై సీఏ కఠినమైన చర్యలు తీసుకుంది. బాల్ టాంపరింగ్ కు పాల్పడిన బాన్ క్రాఫ్ట్ కు తొమ్మిది నెలలు, వివాదానికి కారణమైన స్మిత్, వార్నర్ లపై ఏడాది పాటు నిషేధం విధించింది. అందరు అనుకున్నట్లు ఈ ఘటనను సీరియస్ గా పరిగణించిన అక్కడి బోర్డు అన్ని వివరాలు సేకరించి ఈ శిక్షలు ఖరారు చేసింది. సౌతాఫ్రికా తో జరగనున్న నాలుగో టెస్టు కోసం వీరి ముగ్గురి స్థానంలో వేరే ఆటగాళ్లను పంపనున్నట్లు సీఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జేమ్స్‌ సదర్లాండ్‌ వెల్లడించారు.