టీవీ ఛానళ్లపై మండిపడ్డ నాని..!

SMTV Desk 2018-03-27 18:37:51  hero nani, nani comments on news channel, nani twitter.

హైదరాబాద్, మార్చి 27 : పలు టీవీ ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లపై ప్రముఖ హీరో నాని మండిపడ్డారు. ఈ మధ్య కాలంలో నిరంతరం చిత్ర పరిశ్రమలోని వ్యక్తులను ధూషి౦చడాన్ని ఖండించారు. ఈ మేరకు నాని తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ.. "టీవీ ఛానళ్లు, వ్యాఖ్యాతలు చిత్ర పరిశ్రమను దూషించడానికి ఎల్లప్పుడూ దృష్టిపెట్టడాన్ని గట్టిగా ఖండిస్తున్నా. భవిష్యత్తు నిర్మాణంలో మీడియా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని గుర్తుంచుకోండి. పిల్లలు చూస్తున్నారు.. ఇక చాలు.. ఆపండి" అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇటీవల నటీమణులను ఉద్దేశించి నీచంగా మాట్లాడడాన్ని పలువురు తారలు ఖండించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సదరు వ్యాఖ్యాతపై "మా" సంఘం సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.