షూటింగ్ పూర్తి చేసుకున్న "ఆటగాళ్ళు"

SMTV Desk 2018-03-27 16:31:55  hero Nara Rohit, Aatagaallu movie, aatagaallu shooting completed, Jagapati Babu

హైదరాబాద్, మార్చి 27 : "బాణం"లా దూసుకువచ్చినా.. "సోలో"గానే తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు హీరో నారా రోహిత్. తాజాగా ఈ యువ హీరో.. ఫ్రెండ్స్ మూవీ క్రియేష‌న్స్ బ్యానర్ పై పరుచూరి మురళి దర్శకత్వంలో వస్తున్న "ఆటగాళ్ళు" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి కొన్ని కమర్షియల్ అంశాలను జోడించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో జగపతి బాబు ఒక కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృంద౦ ప్రకటించను౦ది. ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందించగా.. జ‌య్ సి కుమార్ సినిమాటోగ్రఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.