డేటా చౌర్యం వల్ల ఎఫ్ బీ డిలిట్ చేశా : ఫరాన్ అక్తర్

SMTV Desk 2018-03-27 15:56:12  Farhan Akhtar fb delete, Facebook account hacking, Facebook data robbery

ముంబై, మార్చి 27 : ఫేస్ బుక్ ఖాతాదారుల వ్యక్తిగత డేటా చౌర్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు తమ ఫేస్ బుక్ ఖాతాల్ని శాశ్వతంగా డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్.. డేటా చౌర్యంపై సారీ చెప్పినప్పటికీ... బాలీవుడ్ ప్రముఖ నటుడు ఫరాన్ అక్తర్, హాలీవుడ్ నటుడు జిమ్ క్యారీ తమ అధికారిక ఫేస్ బుక్ ఖాతాను డిలీట్ చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన ఫరాన్ అక్తర్.. ఫేస్ బుక్ నుండి వైదొలగినా, ఖాతా మాత్రం ఇంకా కొనసాగుతుందని ఆరోపణ చేశారు. ఇక అందరు ఇదే పాటిస్తూ పోతే ఫేస్ బుక్ కు కొత్త కష్టం మీద పడినట్లే. ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో మరి.