మూగాజీవిపై.. ముదిరిన చెట్టు...

SMTV Desk 2017-06-30 16:04:24  Mouthless organisms, photo, Tree, Crocodile lost, Giorgio State of America,Matthew Storm, Forest area,

జార్జియో, జూన్ 30 : వరదల్లో కొందరు మనుషులు చిక్కుకుపోతే, అలానే అగ్నిప్రమాదంలో ఓ యువకుడు ఇరుక్కుపోతే.. ఎలాగైనా బ్రతకలన్న ఆశతో అరుపులు కేకలతో ఆ పరిసర ప్రాంతాలను హోరెత్తించి ఎలాగోలా సాయాన్ని పొంది ఆ ప్రమాదం నుంచి అదృష్టం బాగుంటే ప్రాణాలతో బయట పడతారు. కానీ ఇదే పరిస్థితి నోరులేని మూగజీవాలకు ఎదురైతే ఎలా ఉంటుందో అన్న ప్రశ్నకు సరైన సమాధానమే ఈ ఫోటో. తనమానాన తాను వెళ్తోంటే.. ఓ చెట్టు హఠత్తుగా దాని మీద పడిపోవడంతో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయిందో మొసలి. ఈ ఘటన అమెరికాలోని జార్జియో రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇటీవల అమెరికాలో మాథ్యూ తుఫాను వచ్చిన విషయం తెలిసిందే. ఈ తుఫాను ధాటికి అమెరికాలోని అటవీ ప్రాంతం మొత్తం వణికిపోయింది. ఎన్నో చెట్లు కూలిపోయి, ఆ ప్రాంతం గందరగోళంగా మారిపోయింది. తుఫాను ముగిసిన నెల రోజుల అనంతరం జార్జియోలోని అటవీ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మత్స్య, జంతు సంరక్షణ అధికారులకు ఈ దృశ్యం కనిపించటంతో, దాన్ని చూసిన వెంటనే జరిగిందేమిటో అర్థం చేసుకున్నారా అధికారులు. సాయం చేసేవారు లేక, దాని నుంచి బయటపడలేక.. విలవిలలాడిపోయి చివరకు ప్రాణాలు విడిచిందా మొసలి. తాము చూసిన దృశ్యాన్ని ఫోటో తీసి.. ప్రకృతి విపత్తుల సమయంలో జంతువుల పరిస్థితి ఇలా ఉంటుందని కామెంట్ పెట్టి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడో అధికారి. ఇది కాస్తా మానవత్వం ఉన్న నెటిజన్ల మనసు గెలుచుకుని వైరల్ అవ్వడంతో అందరి మనసు కదిలించింది.