బాక్సాఫీస్ బద్దలు కొట్టేందుకు బరిలోకి..

SMTV Desk 2018-03-27 12:30:27  rangasthalam, chal mohan ranga, mla movie.

హైదరాబాద్, మార్చి 27 : వేసవిలో సినిమా సందడి మొదలుకానుంది. వరుసగా పెద్ద హీరోల చిత్రాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హడావుడి కాస్తంత ఎక్కువగానే ఉండనుంది. వరుసగా రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లుఅర్జున్, రవితేజ, నాగార్జున, నాని, నితిన్ ఇలా పెద్ద హీరోలందరి సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. సినిమాలకు సంబంధించి వేసవికాలం ఒక మంచి సీజన్ అని చెప్పవచ్చు. విద్యార్థులకు సెలవులు రావడం, కుర్రాలంతా ఖాళీగా ఉండడంతో వారందరు థియేటర్ల ముందు బారులు తీరే సమయం ఇదే. కాని ఈసారి పోటీ ఎక్కువగా ఉంది. వారం తిరిగేలోపు మరో సినిమా థియేటర్ లో ప్రత్యక్షమవుతుంది. ఇటీవల విడుదలైన "యం.యల్.ఏ" చిత్రం ఓ మోస్తరుగా ఆడుతోంది. మరి ఈ వారం రామ్ చరణ్ "రంగస్థలం" చిత్రం వచ్చేస్తోంది. ఆ మరుసటి వారమే నితిన్ "ఛల్ మోహన రంగ" చిత్రం విడుదల కానుంది. సినిమా ఎంత బాగున్నా వారంలోపే క్యాష్ చేసుకోవాలి. ఎందుకంటే బాక్సాఫీస్ ముందు ఆప్ష‌న్లు ఎక్కువ‌గా ఉండే కాల‌మిది. పెద్ద సినిమాల‌కు కావ‌ల్సినంత స్థాయిలో థియేట‌ర్లు దొరుకుతాయి. సినిమా కాస్త అటూ ఇటుగా ఉన్నా.. మ‌రుస‌టి వారానికి మ‌ర్చిపోవాల్సిన ప‌రిస్థితులు వ‌స్తాయి. మరి అందరు పెద్ద హీరోలే బరిలోకి దిగుతుండగా.. అభిమానులకు మాత్రం కనుల పండగ. చూద్దాం ఎవరికి అదృష్టం వరిస్తుందో..!