వావ్... రెజీనా..!

SMTV Desk 2018-03-26 17:45:05  Actress Regina Cassandra, regina new photo, mister chandramouli movie.

హైదరాబాద్, మార్చి 26 : ఒక్క విజయం కోసం ఎంతో పరితపించిపోతూ ఎన్నో ప్రయోగాలు చేస్తున్న హీరోయిన్స్ లలో రెజీనా మొదటిస్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. చూడగానే నవ్వుతో ముఖంతో ఆకర్షించే ఆమె సాధారణ హిట్ కొట్టినా.. ఒక్క గ్లామర్ హిట్ కూడా సాధించలేకపోయింది. ఇటీవల "నక్షత్రం" సినిమాలో అందాలను తెరపై ఎంతో అందంగా ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రెజీనా కు సంబంధించిన ఒక ఫొటో అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఎరుపు రంగు డ్రెస్ లో వాటర్ ఫాల్స్ పక్కన వావ్ అనిపించేలా రెజీనా ఇచ్చిన స్టిల్ ప్రేక్షకులను మంత్రం ముగ్ధులను చేస్తోంది. ఆమెతో పాటు ఓ యువ హీరో కూడా ఆమెతో ఫొటోకు పోస్ ఇచ్చారు. ఈ స్టిల్ ఒక పాటలోనిది అని తెలుస్తోంది. ప్రస్తుతం రెజీనా కోలీవుడ్ హీరో గౌతమ్ తో "మిస్టర్ చంద్రమౌళి" అనే ఒక సినిమా చేస్తోంది. ఇంద్రుడు సినిమా దర్శకుడు శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెజీనాకు హిట్ ఇవ్వాలని ఆశిద్దాం.