తప్పంతా నాదే : ఛార్మి

SMTV Desk 2018-03-26 14:56:55  actress charmy kour, charmy marriage proposal,

హైదరాబాద్, మార్చి 26 : ఈ మధ్య సినిమాలకు విరామ౦ ఇచ్చిన ప్రముఖ నటి ఛార్మి.. పెళ్లి కబుర్లతో మన ముందుకు వచ్చింది. కాని ఈమె వెర్షన్ వింటే అభిమానులు షాక్ తినక తప్పదు. పెళ్లిపై నమ్మకమే లేదని.. రెండు కారణాలను చెబుతోంది. అందులో మొదటగా.. ఎవరో ఒక వ్యక్తి తన జీవితంలోకి వచ్చి ప్రశ్నించడం, నిలదీయడం అస్సలు తట్టుకోలేదట. తను ఎక్కువగా సినిమాలోనే గడుపుతూ.. వీలైతే ఫ్రెండ్స్ తో వెకేషన్స్ కు వెళుతూ.. అందుబాటులో ఉండనని చెబుతుంది. ఇక రెండవది అతి గారాబం.. ఇది కొన్నాళ్లు మాత్రమే ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితో గతంలో ఉన్న రిలేషన్ ఇప్పుడు లేదని.. పూర్తిగా కట్ అయిపోయినట్లు తెలిపింది. అయినా తను చాలా మంచి వాడని కితాబిస్తూ.. తప్పంతా తనదే అంటూ చెప్పుకొచ్చింది.