మహానటి కోసం దుల్కర్ కష్టం చూడండి..!

SMTV Desk 2018-03-26 14:09:17  mahanati movie, hero dulquer salmaan, dulakr salman dubbing.

హైదరాబాద్, మార్చి 26 : ఈ రోజుల్లో ఎవరి సినిమాలకు వారు డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. భాష మీద అవగాహన లేకపోయినా ఎంతో కష్టపడి నేర్చుకొని మరి డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. తాజాగా మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న "మహానటి" చిత్రంలో తెలుగుతో పాటు పలువురు ఇతర భాషల నటులు నటిస్తున్నారు. ఒక కీలక పాత్రను మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ పోషిస్తున్నాడు. సూపర్ స్టార్ మమ్ముట్టికి కుమారుడుగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. అతనిలో ఉన్న అపారమైన ప్రతిభ ఆధారంగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మహానటి కోసం ఇతడు తెగ కష్టపడిపోతున్నాడు. "మహానటి" చిత్రం కోసం తనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు దుల్కర్ సల్మాన్. తానూ పరీక్షల కోసం కూడా ఇంత కష్టపడలేదని చెబుతున్నాడు. తానూ తొలిసారిగా డబ్బింగ్ చెప్పడానికి తన సర్వశక్తులు ఒడ్డుతున్నానంటూ.. డబ్బింగ్ స్టూడియోలో ఉన్న ఫోటోలను పోస్ట్ చేశాడు. ఒకసారి మీరు చూడండి.