రషీద్‌ ఖాన్‌ @ 100..

SMTV Desk 2018-03-26 12:37:47  Rashid Khan, afghanistan bowler rashid khan, icc, Mitchell Starc

హరారే, మార్చి 26: అఫ్గనిస్థాన్‌ బౌలింగ్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ తక్కువ మ్యాచ్‌లలో 100వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. రషీద్‌ ఈ ఫీట్ సాధించడానికి కేవలం 44మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఐసీసీ వరల్డ్‌ కప్‌-2019 క్వాలిఫయర్స్‌లో ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్‌‌ మ్యాచ్‌లో అతను ఈ ఘనతను సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ (52మ్యాచ్‌లలో 100వికెట్లు) పేరిట ఉండేది. అంతేకాకుండా తక్కువ వయస్సులోనే 100 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా రషీద్‌ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా జనవరిలో జరిగిన ఐపీఎల్‌-11 వేలంలో ఈ యువతేజాన్ని ఏకంగా రూ.9కోట్లతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దక్కించుకొంది.