సంచలన ఫోటోను విడుదల చేసిన నటి శ్రీరెడ్డి..

SMTV Desk 2018-03-26 12:35:52  actor srireddy, srireddy leaks, film industry.

హైదరాబాద్, మార్చి 26 : తెలుగు ఇండస్ట్రీలో ఉన్న దర్శకనిర్మాతలు సహా మొత్తం సినీ ఇండస్ట్రీ గురించి నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల పలు టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. చిత్ర పరిశ్రమలో తనకు జరిగిన అవమానాలు, అనుభవాలను పంచుకుంటూ బాగా పాపులారిటీ సంపాదించింది. ఈ సందర్భంగా శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ గా పిలవబడే చిత్ర పరిశ్రమ గురించి సంచలన కామెంట్స్ చేసింది. ఆమె అధికారిక ఫేస్ బుక్ పేజ్ లో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తితో క్లోజ్ గా ఉన్న ఒక చిత్రం విడుదల చేసింది. ఆ ఫోటోలో తనను ముద్దాడటానికి ఓ వ్యక్తి ప్రయత్నిస్తున్నట్లు ఉంది. ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలను కాని.. ఆ వ్యక్తి ముఖాన్ని గాని శ్రీరెడ్డి వెల్లడించడానికి ఇష్టపడకపోవడం గమనార్హం.