"గరుడవేగ" దర్శకుడితో హీరో రామ్..!

SMTV Desk 2018-03-25 17:36:41  HERO Ram, ram new movie, director praveen sattaru,

హైదరాబాద్, మార్చి 25 : యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ తన తదుపరి చిత్ర౦ "గరుడవేగ" ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటించనున్నారు. యాక్షన్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్ర౦లో ఎక్కువ భాగ౦ విదేశాల్లో చిత్రీకరించనున్నట్లు సమాచారం. దర్శకనిర్మాతలు స్విట్జర్లాండ్‌పైనే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. పర్వతశ్రేణుల్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడానికి అందమైన లొకేషన్లను ఎంపిక చేయడానికి ప్రవీణ్ తన ప్రొడక్షన్ టీమ్‌తో యూరప్ వెళ్లినట్లు ఫిలింవర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.