ఘనంగా ఆకాశ్‌ అంబానీ-శ్లోకా నిశ్చితార్థ వేడుక

SMTV Desk 2018-03-25 15:07:58  Akash ambani engagement, Reliance industries, mukesh ambani,

గోవా, మార్చి 25 : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ తనయుడు ఆకాశ్‌ అంబానీ-శ్లోకా మెహతా నిశ్చితార్థ వేడుకను గోవాలో ఘనంగా నిర్వహించారు. శ్లోకా.. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల కంపెనీ రోజీ బ్లూ డైమండ్స్‌ సంస్థ అధినేత రసెల్‌ మెహతా కుమార్తె కావడం విశేష౦. ఈ వేడుక గోవాలో అత్యంత సన్నిహితుల, స్నేహితుల సమక్షంలో నిర్వహించినట్లు తెలుస్తుంది. అయితే అంబానీ తన కోడలికి స్వీట్‌ తినిపిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ విషయంపై అంబానీ కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. వివాహ వేడుకను డిసెంబర్‌లో స్విట్జర్లాండ్‌లో నిర్వహించనున్నట్లు సమాచారం.