ఒకే కప్పులో సల్మాన్, కత్రినా కాఫీ..

SMTV Desk 2018-03-25 13:07:04  salman coffee video viral, salman khan, katrina kaif, dabang tour.

ముంబై, మార్చి 25 : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్.. కత్రినా కైఫ్ లకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. మాజీ ప్రేమికులైన వీరిద్దరూ.. ఒకే కప్పులో టీ తాగుతూ అభిమానులకు దర్శనమిచ్చారు. అసలు విషయం ఏంటంటే.. సల్మాన్ "దబాంగ్‌" పేరిట ఓ టూర్‌ను ప్రారంభించారు. రోజుకో ప్రదేశంలో ఈ టూర్‌ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పుణెలో జరగాల్సిన దబాంగ్‌ టూర్‌ కార్యక్రమానికి సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌, సోనాక్షి సిన్హా హాజరయ్యారు. ఆ సమయంలో సల్మాన్ కాఫీ తాగుతూ.. పక్కనే కూర్చున్న కత్రినా వైపు చూస్తూ కావాలా.? అంటూ సైగ చేశారు. కత్రినా కావాలి అనడంతో తన కప్పును ఆమెకు ఇచ్చారు. అలా ఒకే కప్పులో వీరిద్దరూ కాఫీ తాగుతున్నప్పుడు తీసిన వీడియో ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. కాగా.. వీరిద్దరూ జంటగా నటించిన "టైగర్ జిందా హై" సినిమా రికార్డుల మోత మోగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సల్మాన్‌ "రేస్‌ 3".. కత్రినా "థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌" చిత్రంలో బిజీగా ఉన్నారు.