గో సంరక్షణ పేరుతో హత్యలు...

SMTV Desk 2017-06-30 13:45:56  idian, presaent, modi

రాంచీ, జూన్29 : మన భారత దేశంలో గోవులను పూజించడం అనేది సాంప్రదాయం. కానీ ఇప్పుడు అదే గోవులను చంపి తినడం జరుగుతుంది. కానీ ఇప్పడు మరో కొత్త విషయాలు వార్తలలో హాల్ చల్ చేస్తున్నాయి. అదే గోవులను రక్షించడం అనే పేరుతో ఇప్పుడు మనుషులని చంపుతున్నారు. ఈ విషయంపైన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలా అన్నారు. గోవుల రక్షణ కోసం మనుషుల ప్రాణాలను తీయడం చట్టరీత్య నేరం అని పలికారు. ఇలా చెప్పి ఇరవైనాలుగు గంటలు కూడా గడవక ముందే ఇలాంటి ఒక సంఘటన ఝార్ఖండ్ దగ్గర రామ్ గడ్ జిల్లాలోని బజర్తంద్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలోని వ్యక్తి పేరు అలీముద్దిన్. ఈయన తన కారులో వెళ్తుండగా కొంతమంది దుండగులు ఆతనిపై దాడి చేసారు. అది తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు అప్పటికే అతనిని అతిదారుణంగా కొట్టి పారిపోయారు. కారణం ఏమిటి అని అడుగగా బీఫ్ ను తీసుకువెళ్ళడం వలన అని తెలిసింది. వారు తన కారును ఆపి అతిదారుణంగా కొట్టారు అని అలాగే కారుకి నిప్పు అంటిచారని తెలిసింది. భాదితుడిని వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఇది గో సంరక్షణ కోసం కాదు అని ముందుగానే ప్రణాళిక ద్వారా చేసి హత్య ని పోలీసులు నిర్దారించారు.గోవుల రక్షణ కోసం జరిగే హత్యల కోసం మోదీ నిన్న గుజరాత్ లో చెప్పిన విషయo తెలిసిందే. తప్పును ఎత్తి చూపడం తప్పు కాదు కాని ఎలా చట్టాన్ని తమ చేతులలోకి తీసుకోవడం తప్పు అని మోదీ పలికారు.