నీరవ్‌ మోదీ ఇంటిలో రూ.26 కోట్ల ఆస్తుల జప్తు

SMTV Desk 2018-03-25 11:38:55  PNB Scam, Nirav Modi, CBI & ED raids home, Confiscation of asset

ముంబై, మార్చి 25: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో రూ.13,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), సీబీఐ అధికారులు మళ్లీ సోదాలు నిర్వహించారు. ముంబైలో మోదీకి చెందిన సముద్ర మహల్‌ లగ్జరీ రెసిడెన్షియల్‌ ఫ్లాట్లలో ఇప్పటివరకూ ఒక వజ్రపుటుంగరం రూ. 10 కోట్లు.. పెయింటింగులు రూ. 10 కోట్లు.. వాచీల ఖరీదు రూ. 1.4 కోట్లు.. ఇలాంటి విలువైన వస్తువులను నీరవ్‌ మోదీ ఇంటి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తాజాగా స్వాధీనం చేసుకుంది. రూ. 12 వేల కోట్ల పీఎన్‌బీ మోసం కేసులో ముంబయిలోని నీరవ్‌ మోదీకి చెందిన అపార్టుమెంటులో సీబీఐతో కలిసి ఈడీ 3 రోజులుగా సోదాలు నిర్వహించింది. విలువైన ప్రాచీన ఆభరణాలు సహా మొత్తం రూ. 26 కోట్ల వస్తువులను స్వాధీనం చేసుకుంది.