థ్రిల్ చేసిన "మిస్సింగ్".. ట్రైలర్

SMTV Desk 2018-03-24 15:57:09  missing movie, missing trailer, actress tabu.

హైదరాబాద్, మార్చి 24 : హీరోయిన్ టబు, మనోజ్ బాజ్‌పేయి "మిస్సింగ్" చిత్రంలో నటిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో భార్యాభర్తలిద్దరు తమ చిన్నారితో కలిసి ఓ రిసార్టుకు వెళ్లి ఒక రాత్రి అక్కడ బస చేస్తారు. తెల్లారే సరికి వాళ్ల కూతురు మిస్ అవుతుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్న క్రమంలో వారికి ఆ పాప తండ్రిపై అనుమానం వస్తుంది. ఇంతకు ఆ పాప ఏమైనట్టు.? ఎవరైనా కిడ్నాప్ చేశారా.? అనే విషయాలు ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. తెలుగు థ్రిల్లర్ సినిమాలలో ప్రత్యేకంగా నిలిచిపోయిన "క్షణం" సినిమాను తలపించేలా నటీనటుల హావభావాలు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా అన్ను కపూర్ నటించారు. ముకుల్ అభ్యంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఏప్రిల్ 26 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.