ఐపీఎల్‌ తర్వాత కౌంటీలకు కోహ్లి..

SMTV Desk 2018-03-24 12:36:50  virat kohli, england tour of india, india, ipl

ముంబై, ,మార్చి 24 : ఐపీఎల్‌ మెగా టోర్నీతర్వాత టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంగ్లాండ్ వెళ్లనున్నాడు. జులైలో విరాట్ సారథ్యంలోని భారత్ జట్టు టీ20, వన్డే, టెస్టు సిరీస్‌ల కోసం ఇంగ్లాండ్‌ పర్యటనకు బయలదేరనుంది. అయితే కోహ్లి ముందుగా వెళ్లి అక్కడ కౌంటీల్లో సర్రే జట్టు తరఫున ఆడనున్నాడు. ఈ ఏడాది సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్లు ముందుగా వెళ్లకపోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో జూన్‌ 14న బెంగళూరులో అఫ్గానిస్థాన్‌తో జరిగే ఏకైక టెస్టుకు కోహ్లీ దూరం కానున్నాడు. ఈ ఏడాది మెగా ఐపీఎల్ టోర్నీ ఏప్రిల్ 7న ఆరంభం కానున్న విషయం తెలిసిందే. టోర్నీలో భాగంగా కోహ్లి నాయకత్వం వహిస్తున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తన తొలి మ్యాచ్‌ ను ఏప్రిల్ 8న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.