మిస్సెస్ ఇండియా ఫైనలిస్ట్ ఎవరి భార్యో తెలుసా?

SMTV Desk 2017-06-29 18:48:13  teligu, film, actor, ajay, wife, misses india

హైదరాబాద్, జూన్ 29 : ఇప్పుడు మహిళలు పెళ్ళికి ముందు ఫిట్ గా ఉండటమే కష్టం అలాంటిది పెళ్లి తర్వాత ఇది ఇంకా కష్టం.. అది ప్రత్యేకంగా పిల్లలు పుట్టిన తర్వాత ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడంలో రోజుమొత్తం గడిచిపోతుంది. ఇంక ఫిట్నెస్ కోసం ఆలోచించే తీరిక ఎక్కడిది. కానీ టాలీవుడ్ నటుడు అయిన అజయ్ భార్య శ్వేత రావూరి ఈ అడ్డంకుల్నిదాటి ఫిట్నెస్ కు మారుపేరుగా నిలిచింది."హాట్ మోంద్" నిర్వహించిన మిస్సెస్ ఇండియా వరల్డ్ వైడ్ 2017 పోటీలలో ఈమె ఫైనల్స్ కు చేరింది. ఈ వార్తని తన భర్త అజయ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు.శ్వేత తన భార్య కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అలాగే గర్వంగా కూడా ఉందని చెప్పి, తన భార్య ఫేస్ బుక్ ని షేర్ చేసి లైక్ కొట్టి ఆశీర్వదించమన్నాడు. మిస్సెస్ ఇండియా వరల్డ్ వైడ్ సిద్దమైనట్లు తెలుపుతూ తను బుధవారం వ్యాయామం చేస్తున్న వీడియోలను పోస్ట్ చేసింది.