కివీస్ పంచ్..

SMTV Desk 2018-03-22 13:24:34  New Zealand vs england test, day and night test match, trent boult, tim southee,

ఆక్లాండ్, మార్చి 22 ‌: ఇంగ్లండ్‌తో ప్రారంభమైన డే–నైట్‌ టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ జట్టు బ్రిటిష్ జట్టుకు అదిరిపోయే పంచ్ ఇచ్చింది. కివీస్ బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ పేకమేడల కూలిపోయింది. తొలుత టాస్‌ నెగ్గి ఫీల్డింగ్‌ ఎంచుకున్న కివీస్‌ 20.4 ఓవర్లలో 58 పరుగులకే పత్యర్ధిని అల్ ఔట్ చేసింది. న్యూజిలాండ్‌ జట్టులో ట్రెంట్ బోల్ట్‌ 32 పరుగులిచ్చి 6 వికెట్లు తీయగా, సౌతి 25 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ జట్టులో జోరూట్‌, బెయిర్‌స్టో, స్టోక్స్‌, మహ్మద్‌ అలీ, స్టువర్ట్‌ బ్రాడ్ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. ఓవర్టన్‌ (33), స్టోన్‌మన్‌ (11) మాత్రమే రెండుకెల స్కోర్ చేశారు.