మూడు విడతల్లో ఎంసెట్ కౌన్సిలింగ్

SMTV Desk 2018-03-21 18:16:05  eamcet counselling, third face counselling, telangana, andrapradesh.

హైదరాబాద్, మార్చి 21 : రాబోయే విద్యాసంవత్సరం నుండి ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి జరిపే ఎంసెట్ కౌన్సిలింగ్ లో రెండు విడతలు కాకుండా మూడో విడుత కౌన్సిలింగ్ కూడా నిర్వహించనున్నారు. ఇదువరకు కేవలం రెండు విడుతల కౌన్సిలింగ్ వరకే ఉండేది. రెండో విడతలో కూడా ఆశించిన ఇంజనీరింగ్ సీటు రాకపోతే ఇక విద్యార్థులకి మేనేజ్మెంట్ కోటాలో కళాశాలలో చేరే పరిస్థితి ఉంటుంది. వీటన్నింటికీ పరిష్కారం మూడోవిడత కౌన్సిలింగ్ నిర్వహించడమే అని ఉన్నత విద్యామండలి, తాష్ట్ర సాకేంతిక విద్యా శాఖ ప్రవేశ పెట్టింది. రెండు విడుతలు పూర్తయిన తర్వాత జులై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో ముదోవిడత కౌన్సిలింగ్ ఉంటుంది. ముదోవిదతలో కళాశాలలో బ్రాంచీలు మార్చేందుకు స్లైడింగ్ అవకాశం ఇస్తారు. అయితే స్లైడింగ్ ద్వారా బ్రాంచి మారిని వారు బోధనా రుసుం పొందేందుకు అర్హులు కాదు. వారికి కూడా ఎలా న్యాయం చేయవచ్చో అధికారులు ఆలోచిస్తున్నారు.