వంట చేసిన నారా రోహిత్

SMTV Desk 2017-06-29 18:15:07  nara rohith, sandep kishan, adhi, sudhir babu

హైదరాబాద్, జూన్ 29 : ఇప్పుడు ప్రస్తుతం వార్తలలో నారా వారి "చేపల పులుసు" అనే వీడియో హాల్ చల్ చేస్తుంది. మనందరికీ నారా రోహిత్ హీరోగా మాత్రమే తెలుసు. కానీ ఈయనలో దాగి ఉన్న ఆ మరో కోణాన్ని "శమంతకమణి" సెట్ లో అందరికి పరిచయం చేసాడంట.. భలే మంచి రోజు నిర్మాత అయిన శ్రీరామ్ ఆదిత్య ఈ "శమంతకమణి" సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో నారా రోహిత్ ప్రత్యేక ఆకర్షణకై ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా షూట్ గ్యాప్ లో నారా తన స్వహస్తాలతో "చేపలు పులుసు" చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇది అంతా సినిమా ప్రమోషన్ కోసమే చేసారని అంటున్నారు. రోహిత్ వండిన వంటకాన్ని వీడియో తీసి చివరిలో ఈ సినిమా ట్రైలర్ ను జూన్30 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో సుధీర్ బాబు, సందీప్ కిషన్, నారా రోహిత్, ఆది, ప్రత్వేక పాత్రలో రాజేంద్రప్రసాద్ కనిపించనున్నారు. అలాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో సుధీర్ బాబు తనయుడు దర్శన్, అనన్య సోనీ, చాందిని చౌద‌రి కీలక పాత్రలు పోషించారు. భవ్య క్రియేషన్స్ బేనర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.