విరాట్ న్యూలుక్ చూశారా..?

SMTV Desk 2018-03-21 12:44:21  virat kohli, kohli new hair style, indian cricket captain, ipl,

ముంబై, మార్చి 21 : విరాట్ కోహ్లి.. ప్రస్తుతం ఈ పేరు క్రికెట్ లో తెలియని వారూండరు.. టీమిండియా జట్టుకు నాయకత్వం వహిస్తూ, తన ఆటతో ఎంతో మంది దిగ్గజ ఆటగాళ్ల రికార్డులను అధిగమిస్తూ తనదైన శైలిలో చెలరేగిపోతున్నాడు. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా కోహ్లికి అభిమానులు ఉన్నారు. ఆటలోనే కాకుండా స్టైల్ లో కూడా విరాట్ ది విభిన్న శైలి. తాజాగా ఆయన వచ్చే నెల 7 నుండి జరిగే ఐపీఎల్‌ సీజన్ -11 కోసం సిద్ధమవుతున్నాడు. కాగా ఈ మెగా టోర్నీ కోసం పరుగుల వీరుడు ఒక కొత్త న్యూలుక్‌తో దర్శనమివ్వనున్నాడు. అంతేకాకుండా కొత్త హెయిర్‌స్టయిల్‌ చేయించుకుంటున్న ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.