ప్రపంచ రికార్డు ముంగిట అఫ్గాన్ బౌలర్..

SMTV Desk 2018-03-21 11:18:02  Rashid Khan, ICC World Cup Qualifier, UAE, afghan spinner

హరారె, మార్చి 21: అఫ్గానిస్థాన్‌ యువ స్పిన్నర్‌ రషీద్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ లో ప్రస్తుతం తన ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు. 19 ఏళ్ల వయసులో జాతీయ జట్టులోకి వచ్చిన ఈ యువకిరణం తన స్పిన్ మాయజాలంతో ప్రత్యర్ధులను బోల్తా కొట్టిస్తున్నాడు. తాజాగా ఈ మిస్టరీ స్పిన్నర్ వన్డేల్లో అత్యంత వేగంగా వంద వికెట్ల మైలురాయికి చేరువయ్యాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌ సూపర్‌ సిక్స్‌ దశలో భాగంగా మంగళవారం యూఏఈతో మ్యాచ్‌లో అతను ఐదు వికెట్లు తీశాడు. దీంతో యూఏఈ 43 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. తర్వాత ‌(74), నజీబుల్లా (64) రాణించడంతో 35వ ఓవర్లోనే 5 వికెట్లు కోల్పోయి అఫ్గాన్ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ లో ఐదు వికెట్లతో వన్డేల్లో రషీద్‌ వికెట్ల సంఖ్య 96కు చేరుకుంది. కాగా అతడికిది 42వ వన్డేనే. ఆస్ట్రేలియా ఫాస్ట్‌బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ 52 వన్డేల్లో 100 వికెట్లతో ప్రపంచ రికార్డు సృష్టించాడు.