ఎస్సీ, ఎస్టీ చట్టం కేసుల్లో ఉద్యోగుల అరెస్ట్‌ తగదు: సుప్రీంకోర్టు

SMTV Desk 2018-03-20 18:29:10  supreme court, sc, st, cases, guide lines

న్యూఢిల్లీ, మార్చి 20: ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం కింద ప్రభుత్వాధికారులపై ఫిర్యాదులు చేస్తే వారిని తక్షణమే అరెస్ట్‌ చేయరాదని కోర్టు వెల్లడించింది. ప్రభుత్వాధికారులను అరెస్ట్‌ చేయడానికి ముందే సదరు ఫిర్యాదుపై డిప్యూటీ సూపరింటెండెంట్‌ కంటే పై స్థాయిలోని అధికారి విచారణ జరపాలని, ఆ తర్వాతే అరెస్ట్‌ చేయాలని తెలిపింది.