సిస్కో భాగస్వామ్యంతో డిజిటల్ తెలంగాణ

SMTV Desk 2017-05-27 14:11:09  ktr,it,sisco,america,digital telangana,telangana

హైదరాబాద్, మే 25 : అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం - సిస్కో డిజిటల్, తెలంగాణ ఆవిష్కరణలో భాగస్వామ్యం వహించనుంది. అందులో భాగంగా సిస్కో చైర్మన్, తమ ఆసక్తిని అమెరికా పర్యటనలో ఉన్న ఐటి శాఖామాత్యులు కేటిఆర్ కు వివరించారు. డిజిటల్ ఇండియా, డిజిటల్ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో తమ ఆలోచనలను వివరించారు. టెక్నాలజీ డెమో ప్రాజెక్టులో తాము భాగస్వామ్యం వహిస్తామని ఆ సంస్థ చైర్మన్ జాన్ చాంబర్స్, మంత్రి కేటిఆర్ కు హామి ఇచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటిఆర్ సిలికాన్ వ్యాలీలో ఉన్న సిస్కో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా చైర్మన్ జాన్ చాంబర్స్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్దకు చేరుకోని కేటీఆర్ కు సాదర స్వాగతం పలికారు. చాంబర్స్ తెలంగాణలో జరుగుతున్న పలు ప్రాజెక్టులు: మిషన్ భగిరథ, ఇంటింటికి ఫైబర్ గ్రిడ్ ద్వారా అంతర్జాలం, డిజిటల్ తెలంగాణ లాంటి పలు కార్యక్రమాల నిర్వహణను ప్రశంసించారు.