ఆధార్‌ ఫస్ట్.. పోర్న్ నెక్స్ట్..

SMTV Desk 2018-03-20 12:29:51  aadhar, uidai site, google analytics, mumbai

ముంబై, మార్చి 20 ‌: సాధారణంగా ఇంటర్నెట్‌ చూసేవాళ్లు ఎక్కువగా చూసేవి సినిమా, క్రికెట్‌ విషయాలు. అంతే కాకుండా తక్కువ ధరకే కొన్ని స్మార్ట్‌ఫోన్లు, మొబైల్‌ డేటా రావడంతో ఇంటర్నెట్‌ను వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అయితే, అంతర్జాలంలో ఎక్కువ మంది భారతీయులు దేని గురించి వెతుకుతున్నారో తెలుసా..? కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన భారత విశిష్ట సంఖ్య ఆధార్‌ గురించే. ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌కు చెందిన అనలటిక్స్‌ అలెక్సా గణాంకాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. మిగతా వెబ్‌సైట్లతో పోలిస్తే భారత్‌లో పోర్న్‌ వెబ్‌సైట్లు చూసే వారి సంఖ్య అధికమన్నది బహిరంగ రహస్యం. కానీ గత కొంత కాలంగా పోర్న్ వెబ్‌సైట్లకు మించి యూఐడీఏఐ వెబ్‌సైట్‌కు హిట్స్‌ రావడం గమనార్హం. ఒక నెటిజన్‌ సగటున 8:55 నిమిషాలు యూఐడీఏఐలో సైట్ లో గడుపుతున్నాడని, 33.70శాతం మంది ఆధార్ ‌సైట్‌ను శోధిస్తున్నారని తెలిపింది.