ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్‌ : చాహల్..2

SMTV Desk 2018-03-20 11:25:23  icc t-20 rankings, chahal, nidahas trophy, dinesh karthik

దుబాయ్, మార్చి 20 ‌: శ్రీలంక వేదికగా జరిగిన నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై భారత్ జట్టు గెలిచి కప్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ-20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా బౌలర్, స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ కెరీర్‌ లో అత్యుత్తమ రెండో ర్యాంక్ దక్కించుకొన్నాడు. మరో స్పిన్నర్ వాషింగ్టన్‌ సుందర్ 151స్థానం నుండి 31వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఈ సిరీస్‌లో చాహల్‌ ఎనిమిది వికెట్లు తీసుకున్నాడు. అఫ్గాన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ 759 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు టీమిండియాకు ఒంటి చెత్తో విజయం అందించిన దినేష్ కార్తీక్ 126 స్థానం నుంచి 95వ స్థానానికి చేరాడు. కార్తీక్‌కు టీ-20లో ఇదే అత్యుత్తమం కావడం విశేషం.