అందుకే ఆ సిక్స్ మిస్సయ్యాను : రోహిత్ శర్మ

SMTV Desk 2018-03-19 16:14:56  rohith sharma, dinesh karthik, nidahas trophy, srilanka

న్యూఢిల్లీ, మార్చి 19 :శ్రీలంక లో భారత్- బంగ్లాదేశ్ ల మధ్య జరిగిన ముక్కోణపు టీ-20 మ్యాచ్ ఫైనల్ ప్రపంచ కప్ ఫైనల్ జరిగింది. ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో చివరి బంతిని ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా ఫ్లాట్‌ సిక్స్ మలిచి.. టీమిండియాకు దినేశ్‌ కార్తీక్‌ (డీకే) మరుపురాని విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఆ సిక్స్ తో ప్రస్తుతం డీకే హీరోగా మారిపోయాడు. అతని సిక్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. కాగా కార్తీక్‌ చివరి బంతికి కొట్టిన ఆ విన్నింగ్ షాట్ ను టీమిండియా సారథి రోహిత్ శర్మ మిస్సయ్యాడు. తనే ఆ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. " చివరి బంతికి ఐదు పరుగులు చేయాలి. మ్యాచ్‌ టై అవుతుందేమోనని భావించి నేను డ్రస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లి ప్యాడ్ కట్టుకుంటున్నాను. సూపర్ ఓవర్ ద్వారానే ఫలితం దక్కుతుంది అనుకున్నాను. కానీ ఈ లోగా డీకే సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించాడు. అందుకే అతని సిక్స్ మిస్సయ్యాను" అని వ్యాఖ్యానించాడు.