వాట్ ఏ షాట్.. వాట్ ఏ ఇన్నింగ్స్..

SMTV Desk 2018-03-19 13:19:05  DINESH KARTHIK, NIDAHAS TROPHY, INDIA VS BANGLADESH, SRILANKA

కొలంబో, మార్చి 19 : ఒక్క సిక్స్.. దినేష్ కార్తీక్ ను ఒక్క రోజులో హీరోగా మార్చేసింది.. టీమిండియా క్రికెట్ లో బెస్ట్ ఫినిషర్ ఎవరంటే ఠక్కున మదిలో నిలిచే పేరు.. యం. ఎస్. ధోని. తాజాగా అలాంటి అద్భుతాన్ని ఆవిష్కరించిన మరో భారత్ ఆటగాడు దినేష్ కార్తీక్ (డీకే). ఇప్పుడు అంతర్జాలంలో కార్తీక్ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురుస్తుంది. వాట్ ఏ షాట్.. వాట్ ఏ ఇన్నింగ్స్..అంటూ పలువురు అభిమానులు, క్రికెటర్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. శ్రీలంక వేదికగా నిన్న నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో చివరి బంతికి ఐదు పరుగులు కావాలంటే ఎటువంటి ఒత్తిడి దరి చేరనీయకుండా ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా ఫ్లాట్‌ సిక్స్ కొట్టి టీమిండియా కు విజయాన్ని అందించాడు. ఆ చివరి బంతి సిక్స్ ను భారత్ అభిమాని ఎప్పటికి మరిచిపోలేడు. అయితే ఈ మ్యాచ్ లో తొలుత భారత్ గెలవడం కష్టమేనని అనుకున్నారంతా..! టీవీలు ఆపేసి, ఫోన్లు పక్కన పెట్టి పడుకున్నవారంతా, ఉదయం లేవగానే పేపర్, ఆన్ లైన్ లో చూసే సరికి అభిమానులు షాక్. కారణం డీకే.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఆఖరి బంతి సిక్స్ ఫుల్ వైరల్ గా మారింది.