పెళ్లిలో డాన్స్ చేసిందని..భార్యను హతమార్చిన భర్త

SMTV Desk 2018-03-19 12:17:43  women, murderd, husband, west bengal

కోల్‌కతా, మార్చి 19: పెళ్లిలో డాన్స్ చేసిందని అక్కసుతో తన భార్యను ఓ భర్త దారుణంగా చంపేశాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ 24 పరగణాల జిల్లాలోని బసంతిలో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే..స్వప్న (18)అనే యువతికి సుబీర్ నష్కర్ అనే వ్యక్తితో ఇటీవలే వివాహం జరిగింది. అయితే శనివారం తమ బంధువుల వివాహా వేడుకకు సుబీర్, స్వప్న తమ తల్లిదండ్రలతో కలిసి వెళ్లారు. అక్కడ స్వప్న కొంత మంది యువకులతో కలిసి డ్యాన్స్‌ చేసింది. అది సుబీర్‌కు నచ్చలేదు. దీంతో సుబీర్ అందరి ముందే భార్యతో గొడవ పెట్టుకొన్నాడు. డ్యాన్స్ ఎందుకు చేశావని అక్కడే నిలదీశాడు. దీంతో స్వప్న అలిగి ఇంటికి వెళ్ళిపోయింది. అనంతరం తల్లితో కలిసి సుబీర్‌ ఇంటికి వెళ్ళిపోయాడు. కొపం తట్టుకోలేక తల్లితో కలిసి స్వప్నను గొంతు నులిమి చంపేశారు. ఆపై తన భార్య ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించి అందరిని నమ్మించేందుకు యత్నించాడు. అయితే స్వప్న తల్లిదండ్రులు సుబీరే ఆమెను హత్యచేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో అసలు విషయాలు వెలుగులోకి రావడంతో, సుబీర్ తో పాటు అతని తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.