ప్రధాని, కేసీఆర్ లపై రేవంత్ ఫైర్..

SMTV Desk 2018-03-18 18:08:47  congress leader, revanth reddy, pm modi, ts cm, kcr.

హైదరాబాద్, మార్చి 18 : ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ లపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ను నరేంద్ర మోదీ వెనకుండి నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ, కేసీఆర్ లు కవలపిల్లల౦టూ ఎద్దేవా చేశారు. థర్డ్ ఫ్రంట్ అనేది కాంగ్రెస్ కు వ్యతిరేక౦గా కేసీఆర్.. చేస్తున్న ప్రయత్నమన్నారు. టీఆర్ఎస్, బీజేపీ చేసే అరాచకాల్ని దేశ ప్రజలంతా చూస్తున్నారని, మోదీ నయవంచకుడన్నారు. అలాగే ప్రజలకు మరింత చేరువలో ఉండేందుకు పాదయాత్రలు చేస్తామంటూ రేవంత్ పేర్కొన్నారు.