తెలంగాణ మిగులు రాష్ట్రం..! : కేసీఆర్

SMTV Desk 2018-03-18 16:10:35  ts cm, kcr, ugadhi festival, pragathi bhavan.

హైదరాబాద్, మార్చి 18 : తెలుగు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ప్రగతిభవన్ లో ఉగాది వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. “ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని ఆ భగవంతున్ని వేడుకున్నా. సంవృద్దిగా వర్షాలు పడి రైతాంగం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని.. మనసారా కోరుకున్నా. పంచాంగ కర్తలు కూడా శుభకరమైన వార్తను తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాశి కర్కాటక రాశి.. ఆదాయం 8, వ్యయం 2 అని చెప్పారు. తెలంగాణ బడ్జెట్‌ మిగులు రాష్ట్రంగా ఉంటుంది” అని వివరించారు. అలాగే ఈ సంవత్సరం ఎన్నికల సంవత్సరం కాబట్టి.. ఎక్కువగా ప్రజలలో ఉండి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.