స్వతంత్రంగానే బరిలోకి.. : పవన్

SMTV Desk 2018-03-18 14:41:25  janasena, pawan kalyan, pm modi, chandrababu naidu.

అమరావతి, మార్చి 18 : 2019 ఎన్నికల్లో స్వతంత్రంగానే జనసేన పోటీ చేస్తు౦దని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడలో జనసేన పార్టీ సమన్వయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. "రాజకీయంగా ప్రత్యేకంగా ఎలాంటి ప్రణాళికలు ఇప్పటివరకు లేవు. 2019 ఎన్నికల్లో పూర్తి స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నా. ప్రధానంగా సామాజిక సమతౌల్యం తీసుకురావాలన్నదే ప్రధాన ఉద్దేశం" అంటూ అభిప్రాయమన్నారు. పవన్.. తానూ ఎప్పటి నుండో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నానన్నారు. హోదా ఇవ్వకుంటే ఆంధ్రప్రదేశ్ లో మనుగడ కష్టమని ప్రధానికి తెలుసన్నారు. వామపక్షాలతో తనకు తొలినుంచే అవగాహన ఉందని.. మరే ఇతర పార్టీలతో పొత్తులకు అవకాశాలు లేవని అన్నారు. అతి త్వరలోనే హోదా కోసం జరిగే పోరాట కార్యాచరణను వెల్లడిస్తానని వెల్లడించారు.