మల్టీస్టారర్ చిత్రంలో కల్యాణ్ రామ్..!

SMTV Desk 2018-03-18 13:18:15  kalyan ram, multi star movie, hyderabad

హైదరాబాద్, మార్చి 18 : నందమూరి వారసులు మల్టీస్టారర్ పై ఆసక్తి చూపుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తాజాగా కళ్యాణ్ రామ్ కూడా ఓ మల్టీ స్టారర్ చిత్రంలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా దర్శకుడెవరు?.. మరో హీరో ఎవరనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. ప్రస్తుతం కల్యాణ్ రామ్ నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉన్నాయి.