నిరాశే మిగిలింది..

SMTV Desk 2018-03-18 12:27:52  All England Badminton, PV Sindhu vs Akane Yamaguchi, pv sindhu, birmingham

బర్మింగ్‌హామ్‌, మార్చి 18 : ఆల్ ఇంగ్లాండ్ టోర్నీలో భారత్ కు నిరాశే ఎదురయ్యింది. ఎన్నో ఆశలతో, అసాధారణ పోరాటపటిమతో సెమీస్ కు చేరిన తెలుగుతేజం పీ.వీ. సింధు రెండో సీడ్‌ అకానె యమగూచి (జపాన్‌) చేతిలో పోరాడి ఓడింది. హోరాహోరిగా సాగిన పోరులో పాయింట్లు సాధించాల్సిన సమయంలో అనవసర తప్పిదాలు చేసి పీ.వీ.సింధు మూల్యం చెల్లించుకుంది. మరో వైపు శుక్రవారం రాత్రి జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రణయ్‌, హువాంగ్‌ యుజియాంగ్‌ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యాడు.